‘మా’ అధ్యక్షుడు ఎవరు? | Shivaji Raja and Naresh in the race of Movie Artist Association Elections | Sakshi
Sakshi News home page

‘మా’ అధ్యక్షుడు ఎవరు?

Mar 11 2019 12:40 AM | Updated on Mar 11 2019 12:41 AM

Shivaji Raja and Naresh in the race of Movie Artist Association Elections - Sakshi

శివాజీరాజా, నరేశ్

... అనే ఉత్కంఠ చిత్ర వర్గాల్లో నెలకొంది. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో  ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఆదివారం జరిగాయి. సీనియర్‌ నరేశ్, శివాజీరాజా ప్యానెల్స్‌ బరిలో నిలిచాయి. ‘మా’లో సుమారు 800మంది సభ్యులు ఉండగా 472 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్‌æపద్ధతిలో ఓటింగ్‌ విధానం జరగడంతో లెక్కింపు ఆలస్యమైందని తెలిసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాకే రిజల్ట్‌ వచ్చే పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో ‘మా’ నూతన అధ్యక్షుడు శివాజీరాజానా? నరేశా? అన్నది నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. జమున, రోజా రమణి, గీతాంజలి, కోటా శ్రీనివాసరావు, కృష్ణ, విజయ నిర్మల, చిరంజీవి, నాగార్జున, బాబూమోహన్, గిరిబాబు, రాళ్లపల్లి, విజయ్‌ చందర్, చలపతిరావు, జయసుధ, వై.విజయ, జయలలిత, ఆర్‌. నారాయణమూర్తి, రాజశేఖర్, జీవిత, లక్ష్మీ మంచు, ‘అల్లరి’ నరేశ్, నాని, రానా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుధీర్‌బాబు, సునీల్, అలీ, తరుణ్, జేడీ చక్రవర్తి, ప్రియమణి వంటి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


కృష్ణ, జమున, కోటా శ్రీనివాసరావు


చిరంజీవి,  నాగార్జున,  జయసుధ

Advertisement
 
Advertisement
Advertisement