శర్వానంద్‌ ‘శ్రీకారం’ ముహూర్తం ఫిక్స్‌! | Sharwanand Sreekaram Telugu Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

‘శ్రీకారం’ ముహూర్తం ఖరారు!

Feb 1 2020 12:39 PM | Updated on Feb 1 2020 12:39 PM

Sharwanand Sreekaram Telugu Movie Release Date Fix - Sakshi

హీరో శర్వానంద్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌

శర్వానంద్‌ ‘శ్రీకారం’కు ముహూర్తం ఖరారయింది. విభిన్న కథలతో తనకంటూ టాలీవుడ్‌లో ఓ పత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ తాజాగా చేస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రస్తుతం ‘జాను’చిత్రంతో బిజీగా ఉన్న శర్వా.. ఈ సినిమాతో పోటు ‘శ్రీకారం’చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌లో వావ్‌ అనిపించిన శర్వానంద్‌.. తన అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ తెలిపాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 24న విడుదల చేయబోతున్నట్లు అపీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. చిత్ర విడుదల ముహూర్తాన్ని ఫిక్స్‌ చేస్తూ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాలో శర్వానంద్‌కు జంటగా ప్రియాంకా అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో కలర్ ఫుల్ షర్ట్, లుంగీ ఎత్తి కట్టి, నల్ల తువ్వాల భుజంపై వేసుకుని పొలాల్లో నడిచి వస్తున్న శర్వా లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆ ఒక్క పోస్టర్‌తో చిత్రంపై పాజిటీవ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ‘శతమానంభవతి’ తర్వాత పల్లెటూరు నేపథ్యంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.}

చదవండి:
‘దిల్‌’ రాజుకి ఏమైనా మెంటలా!

ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’ 

Advertisement
 
Advertisement
Advertisement