గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారు : సీనియర్‌ హీరోయిన్‌

Senior Actress Amani Opens Up About Casting Couch - Sakshi

సినీ రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్‌ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ కూడా నడిచింది. అయితే ఇటీవల టాలీవుడ్‌ను ఇదే అంశం కుదిపేస్తోంది. తాజాగా ఈ విషయంపై సీనియర్‌ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ ఆమని స్పందించారు.

ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు. కాస్టింగ్ కౌచ్‌ అన్నది కొత్త అంశమేం కాదని గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలిపారు. స్వయంగా తాను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. సినిమా గురించి మాట్లాడేందుకు సంప్రదించిన కొందరు అంతా ఓకె అనుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారని తెలిపారు.

అంతేకాదు ప్రత్యేకంగా మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాళ్ల మాటలను బట్టే అంతా అర్ధమయ్యేదని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇంలాంటి ఇబ్బందులు ఉండేవి కావన్న ఆమని, చిన్నకంపెనీల నుంచి ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top