హాలీవుడ్ నటికి విడాకులు మంజూరు | Scarlett Johansson got separated from Romain Dauriac | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ నటికి విడాకులు మంజూరు

Oct 3 2017 4:59 PM | Updated on Oct 3 2017 4:59 PM

Scarlett Johansson got separated from Romain Dauriac

ప్రముఖ హాలీవుడ్ న‌టి స్కారెట్ జోహ‌న్ స‌న్ కు కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2014లో రొమైన్ డ్యూరియక్ ను స్కార్లెట్ రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రోజ్ డొరథీ అనే కూతురు ఉంది. అయితే కొంత కాలం క్రితం స్కార్లెట్, రొమైన ల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే పాప బాధ్యత ఎవరికి అప్పగించాలన్న విషయం పై ఒక నిర్ణయానికి రాలేకపోవటంతో ఆరునెలలుగా విడాకుల విషయం కోర్టులోనే ఉంది.

తాజాగా పాప బాధ్యత పూర్తిగా నాకే వదిలేయాలంటూ స్కార్లెట్ కోరటంతో మ్యాన్‌హట్టన్‌ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొద్ది రోజులుగా కొలిన్ జోస్ట్ అనే వ్యక్తితో స్కార్లెట్ సన్నిహితం ఉంటుందన్న ప్రచారం జరగుతోంది. అయితే విడాకులు మంజూరు అయిన సందర్భంగా స్పందించిన ఈ హాలీవుడ్ నటి మాత్రం ఇక నాది ఒంటరి జీవితమే అంటూ కామెంట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement