లోకల్‌ అబ్బాయి సరసన? | Sai Pallavi to romance Nani? | Sakshi
Sakshi News home page

లోకల్‌ అబ్బాయి సరసన?

Feb 12 2017 11:17 PM | Updated on Sep 5 2017 3:33 AM

లోకల్‌ అబ్బాయి సరసన?

లోకల్‌ అబ్బాయి సరసన?

మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్‌ అందుకుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం.

మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్‌ అందుకుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. మలయాళ ‘ప్రేమమ్‌’తో ఒక్కసారిగా క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ సరసన ‘ఫిదా’లో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి ఛాన్స్‌ దక్కించుకున్నారని సమాచారం.

వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఇటీవల ‘నేను లోకల్‌’ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ లోకల్‌ కుర్రాడి సరసనే సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో నానీకి అక్కగా అందాల భామ భూమిక నటించనున్నారనే వార్త వచ్చింది. త్వరలో ఈ చిత్రం గురించి నిర్మాత అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement