కార్తికేయ కొత్త చిత్రం ‘గుణ 369’ | Rx 100 Fame Kartikeya 3rd Movie Titled as Guna 369 | Sakshi
Sakshi News home page

కార్తికేయ కొత్త చిత్రం ‘గుణ 369’

Apr 26 2019 4:04 PM | Updated on Apr 26 2019 4:04 PM

Rx 100 Fame Kartikeya 3rd Movie Titled as Guna 369 - Sakshi

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి ‘గుణ 369’ అనే పేరును ఖ‌రారు చేశారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌లోగోను చిత్రయూనిట్ లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా ద‌ర్శకుడు మాట్లాడుతూ ‘ఇంత‌కు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మ‌ళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వ‌ర‌కు మ‌రో భారీ షెడ్యూల్ చేయ‌బోతున్నాం. దాంతో ఒక సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ‌. ‘369’ అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌స్తోంది’ అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ‘రియ‌ల్ ల‌వ్ ఇన్సిడెంట్స్ తో బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ క‌థ‌ను అద్భుతంగా త‌యారు చేసుకున్నాడు. విన‌గానే చాలా ఇంప్రెస్ అయి వెంట‌నే ఓకే చెప్పేశాం. ల‌వ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్‌లో ఉంటుంది. క‌చ్చితంగా యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ క్యార‌క్టరైజేష‌న్ ‘ఆర్ ఎక్స్ 100’, ‘హిప్పీ’ క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన‌ ర‌షెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది’ అన్నారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం రామ్‌ సినిమాటోగ్రాఫర్‌.

Advertisement
 
Advertisement
Advertisement