బై బై బల్గేరియా

rrr movie shooting completed in bulgaria - Sakshi

బల్గేరియాకు బై బై చెప్పి హైదరాబాద్‌కు హాయ్‌ చెప్పారు ఎన్టీఆర్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన నటించే హీరోయిన్‌ను ఫైనలైజ్‌ చేయాల్సి ఉంది. 

బల్గేరియాలో ఇటీవల మొదలైన ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తికావడంతో ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారట ఎన్టీఆర్‌. ఈ షెడ్యూల్‌లో ఆయన ఇంట్రడక్షన్‌ సీన్స్‌ తీశారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారట. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top