సంక్రాంతికి సై | RRR movie release date postponed to 2021 | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సై

Feb 6 2020 5:46 AM | Updated on Feb 6 2020 8:33 AM

RRR movie release date postponed to 2021 - Sakshi

ఎన్టీఆర్, రాజమౌళి, రామ్‌చరణ్‌

దర్శకుడు రాజమౌళి తన పందెంకోళ్లను వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్‌ బరిలో దించడానికి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నట్లు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత సినిమా వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ సినిమాను జనవరి 8, 2021 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘‘ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాలని మా టీమ్‌ అందరం కష్టపడుతున్నాం. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే కానీ మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం ట్వీటర్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement