ఆవేశమే ఆయుధం | Record Price For Naa Peru Surya Satellite Rights | Sakshi
Sakshi News home page

ఆవేశమే ఆయుధం

Jan 19 2018 12:30 AM | Updated on Jan 19 2018 12:30 AM

Record Price For Naa Peru Surya Satellite Rights - Sakshi

కారణం లేని కోపం ప్రమాదం అంటారు. అది శత్రువుకు అవకాశం అని చెబుతారు. కానీ సూర్యాకి ఆవేశమే ఆయుధం. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ సినిమాలో సూర్య అనే సైనికుడి పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ప్రజెంట్‌ ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఓ భారీ ఫైట్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్‌ కోసం కోటి రూపాయలతో సెట్‌ వేయడం విశేషం. విశేషం ఏంటంటే.. డైరెక్టర్‌ కావాలనుకుంటున్న ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ ఈ మధ్య ఫైట్‌ మాస్టర్‌గా సినిమాలు ఒప్పుకోవడం లేదట. కానీ ఈ చిత్రకథ విని, ఒప్పుకున్నారట. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం తీస్తున్న ఇంటర్వెల్‌ ఫైట్‌ ‘అదరహో’ అనే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో నాలుగు మేజర్‌ ఫైట్స్‌ ఉన్నాయని టాక్‌.

మిగిలిన ఫైట్‌ను రామ్‌–లక్ష్మణ్, రవి వర్మ, బ్యాంకాక్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కిచా డిజైన్‌ చేశారు. బన్నీ కెరీర్‌లో ఇది హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీగా నిలుస్తుందని టాక్‌. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ చిత్రంలోని ‘సైనికా..’ అనే పాటను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషా శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’వాసు సహ నిర్మాత. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement