మే 8న రవితేజ క్రాక్‌ | Ravi Teja Krack Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

మే 8న రవితేజ క్రాక్‌

Feb 22 2020 12:10 AM | Updated on Feb 22 2020 11:53 AM

Ravi Teja Krack Movie Teaser Launch - Sakshi

రవితేజ

‘ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్‌ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ అంటూ మొదలవుతుంది ‘క్రాక్‌’ టీజర్‌. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బి.మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘ఒరేయ్‌ అప్పిగా, సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా...’ ఇలా టీజర్‌లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ– ‘‘టీజర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఉంది. టీజర్‌లోలాగే సినిమాలోనూ తమన్‌ మ్యూజిక్‌ అదిరిపోతుంది. విష్ణు మంచి విజువల్స్‌ ఇచ్చాడు. విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి. మధు, చిత్ర సహనిర్మాత అమ్మిరాజు, ప్రొడ్యూసర్‌ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement