ట్రిబ్యూట్‌ టు రంగీలా

Ram Gopal varma Producing Beautiful Movie Tribute To rangeela - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ కెరీర్‌లో ‘రంగీలా’ సినిమా చాలా స్పెషల్‌. ఇప్పుడు ఆ సినిమాకు ట్రిబ్యూట్‌గా ‘బ్యూటిఫుల్‌’ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రిబ్యూట్‌ టూ రంగీలా’ అనేది క్యాప్షన్‌. రామ్‌గోపాల్‌ వర్మ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్‌ నిర్మిస్తున్నారు.  సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు వర్మతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 9న ‘బ్యూటిఫుల్‌’ ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ సినిమాకు పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top