ఆన్‌ స్క్రీన్‌ వారియర్స్‌... ఆఫ్‌ స్క్రీన్‌ బ్రదర్స్‌ | Ram Charan new movie Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

ఆన్‌ స్క్రీన్‌ వారియర్స్‌... ఆఫ్‌ స్క్రీన్‌ బ్రదర్స్‌

Nov 4 2018 6:32 AM | Updated on Nov 4 2018 6:32 AM

Ram Charan new movie Vinaya Vidheya Rama - Sakshi

వివేక్‌ , రామ్‌చరణ్‌

‘‘కెమెరా ఆన్‌ చేస్తే రామ్‌చరణ్, నేను వారియర్స్‌లా ఫైట్‌ చేసుకున్నాం. కెమెరా ఆఫ్‌ చేస్తే అన్నదమ్ములుగా కబుర్లు చెప్పుకున్నాం’’ అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదారాబాద్‌లో జరుగుతోందని సమాచారం.

‘‘ఈ సినిమాకు సంబంధించి నా లాస్ట్‌ డే (శనివారం) షూటింగ్‌లో పాల్గొన్నాను. నా తమ్ముడు రామ్‌ చరణ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నువ్వు(రామ్‌ చరణ్‌) చూపించిన ప్రేమాభిమానలకు థ్యాంక్స్‌. గొప్ప నటులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్‌ అన్నీ ఆయన కొడుకు రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు వివేక్‌. స్నేహ,ఆర్యన్‌ రాజేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement