స్టార్ హీరోయిన్ బాలీవుడ్ రీ ఎంట్రీ | Rakul Preeth Bollywood Re entry | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్ బాలీవుడ్ రీ ఎంట్రీ

Jun 17 2017 11:46 AM | Updated on Sep 5 2017 1:52 PM

స్టార్ హీరోయిన్ బాలీవుడ్ రీ ఎంట్రీ

స్టార్ హీరోయిన్ బాలీవుడ్ రీ ఎంట్రీ

ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్లో

ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్న ఈ బ్యూటి బాలీవుడ్లో సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటోంది. రకుల్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ బాలీవుడ్ సినిమాతోనే జరిగింది. యారియన్ సినిమాతో వెండితెర మీద మెరిసిన ఈ భామ.. అక్కడ ఆశించిన విజయం దక్కకపోవటంతో సౌత్ బాట పట్టింది.

సౌత్లో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ ప్రజెంట్ టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. అయితే ఇలాంటి టైంలో బాలీవుడ్ రీ ఎంట్రీ రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. కానీ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబీ లాంటి సినిమాలను తెరకెక్కించిన నీరజ్ పాండే దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావటంతో రకుల్ కాదనలేకపోయిందట. నీరజ్ దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఐయారీ సినిమాలో రకుల్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement