విదేశాల్లో వేడుకలు! | rajinikanth family new york holiday tour | Sakshi
Sakshi News home page

విదేశాల్లో వేడుకలు!

Dec 24 2018 1:24 AM | Updated on Sep 12 2019 10:40 AM

rajinikanth family new york holiday tour - Sakshi

రజనీకాంత్‌

గత ఐదేళ్లతో పోలిస్తే సినిమాల విషయంలో రజనీకాంత్‌ ఈ ఏడాది స్పీడ్‌ పెంచినట్లు తెలుస్తోంది. ‘కాలా, 2.ఓ’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా ‘పేట్టా’ అనే మరో సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి ఈ ఏడాదిని బిజీ బిజీగా గడిపారు రజనీకాంత్‌. అందుకే ఇప్పుడు ఆయన హాలీడేను ప్లాన్‌ చేసుకున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. ఫ్యామిలీతో కలిసి రజనీ న్యూయార్క్‌ వెళ్లారన్నది తాజా సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను రజనీ కుటుంబం అక్కడే జరుపుకుంటుందట.

ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ ప్రమోషన్‌ కోసం జనవరి మొదటివారంలో రజనీ ఇండియాకి తిరిగొస్తారని టాక్‌. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో త్రిష, సిమ్రాన్‌ కథానాయికలుగా నటించారు. విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మాళవిక మోహనన్‌ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చారు. రజనీకాంత్‌ నెక్ట్స్‌ మూవీ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement