లెక్కలు చెప్పేదాన్ని! | Radhika Apte Would Have Been A Mathematician | Sakshi
Sakshi News home page

లెక్కలు చెప్పేదాన్ని!

May 26 2019 1:56 AM | Updated on May 26 2019 1:56 AM

Radhika Apte Would Have Been A Mathematician - Sakshi

రాధికా ఆప్టే

సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు కథానాయిక రాధికా ఆప్టే. వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. రాధికా సక్సెస్‌ఫుల్‌ జర్నీ ఇప్పుడు హాలీవుడ్‌ వరకూ వెళ్లింది. అక్కడ ఆమె ఒక సినిమా సైన్‌ చేశారు. కథానాయికగా ఈ రేంజ్‌లో సక్సెస్‌ అయిన మీరు ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అనే ప్రశ్న రాధికా ముందు ఉంచితే – ‘‘మ్యాథమేటిక్స్‌ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్‌ని చాలా స్పెషల్‌గా చదివేదాన్ని. అలాగే వైల్డ్‌లైఫ్‌ అన్నా ఇష్టమే. ఒకవేళ నేను యాక్టర్‌ కాకపోయి ఉంటే బహుశా మ్యాథ్స్‌ టీచర్‌గా లెక్కలు చెబుతూ ఉండేదాన్నేమో. ఒకవేళ అది కూడా కుదరకపోతే వైల్డ్‌లైఫ్‌ రంగంలో ఉద్యోగం చేసేదాన్నేమో. ఎవరికి తెలుసు? ప్రస్తుతం అయితే నటిగా సినిమా పరిశ్రమలో మంచిస్పేస్‌లోనే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement