ఓ చిన్న ప్రయత్నం | Radhika Apte makes directorial debut with short film | Sakshi
Sakshi News home page

ఓ చిన్న ప్రయత్నం

Oct 25 2019 5:54 AM | Updated on Oct 25 2019 5:54 AM

Radhika Apte makes directorial debut with short film - Sakshi

రాధికా ఆప్టే

స్టార్ట్‌... కెమెరా.. యాక్షన్‌ అని దర్శకుడు చెప్పగానే పాత్రలో లీనమైపోయి హీరోయిన్‌గా ఇన్ని రోజులు డైలాగ్‌లు చెప్పారు రాధికా ఆప్టే. కానీ తొలిసారి యాక్టర్స్‌ చేత డైలాగ్స్‌ చెప్పించారామె. అదేనండీ.. ఆమె ఓ 30 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ కోసం దర్శకురాలిగా మారారు అని చెబుతున్నాం. గుల్షన్‌ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్‌ వాకర్స్‌’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించారు రాధికా ఆప్టే. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో చిన్నగా ఏదో ప్రయత్నించాను.

ఇది నిర్మాతలు లలిత, హనీ, అభిషేక్‌లకు నచ్చడంతో నిర్మిస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్లీప్‌ వాక ర్స్‌’ విడుదలైన తర్వాత వీక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు షార్ట్‌ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన రాధికా భవిష్యత్‌లో ఏదైనా సినిమాను డైరెక్ట్‌ చేస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement