'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు | 'Premam' release date confirmed | Sakshi
Sakshi News home page

'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు

Sep 6 2016 3:49 PM | Updated on Sep 4 2017 12:26 PM

'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు

'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారయ్యింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారయ్యింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 20వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఎవరే' పాట యూత్ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement