అక్కడ క్రిస్టియన్... ఇక్కడ హిందూ! | Premam gets censor board nod, to release on October 7 with U/A certificate | Sakshi
Sakshi News home page

అక్కడ క్రిస్టియన్... ఇక్కడ హిందూ!

Oct 4 2016 11:18 PM | Updated on Sep 4 2017 4:09 PM

అక్కడ క్రిస్టియన్... ఇక్కడ హిందూ!

అక్కడ క్రిస్టియన్... ఇక్కడ హిందూ!

‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలయాళ ‘ప్రేమమ్’లో చిన్నపాటి మార్పులు చేశారు. భాష మాత్రమే మారింది. ప్రేమలోని భావం మారలేదు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్.

‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలయాళ ‘ప్రేమమ్’లో చిన్నపాటి మార్పులు చేశారు. భాష మాత్రమే మారింది. ప్రేమలోని భావం మారలేదు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘ప్రేమమ్’.

పీడీవీ ప్రసాద్ సమర్పకులు. ఈ నెల 7న విడుదల. అనుపమ మాట్లాడుతూ - ‘‘మలయాళంలో క్రిస్టియన్‌గా, తెలుగు రీమేక్‌లో హిందూ అమ్మాయిగా చేశా. చైతూ చాలా ఫ్రెండ్లీ, చందు కూల్. షూటింగ్ పిక్నిక్‌లా జరిగింది. నాకు మనీ ముఖ్యం కాదు. సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టం. త్రివిక్రమ్‌గారి గురించి వినగానే ‘అఆ’కు సంతకం చేశా. ఆయన గురువులాంటి వ్యక్తి. నటన, సినిమాల ఎంపిక పరంగా సలహాలిస్తారు. ప్రస్తుతం శర్వానంద్ ‘శతమానం భవతి’లో నటిస్తున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement