మెహబూబా కొత్తగా ఉంది : ప్రభాస్‌ | Prabhas Wishes To Mehbooba Team | Sakshi
Sakshi News home page

May 10 2018 4:01 PM | Updated on Mar 22 2019 1:53 PM

Prabhas Wishes To Mehbooba Team - Sakshi

కొద్ది రోజులుగా సరైన హిట్స్‌లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ శుక్రవారం మెహబూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్‌ చేస్తున్నాడు పూరి. భారత్‌ పాక్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథను పూరి స్వయంగా నిర్మించారు.

ప్రమోషన్‌ విషయంలో కూడా పూరి జగన్నాథ్‌ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మెహబూబా టీంకు తన అభినందనలు తెలియజేశారు. ‘మెహబూబా రెగ్యులర్‌ పూరి సినిమాలా లేదు. పూరి సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్‌ చుట్టూనే తిరుగుతాయి. మెహబూబా కొత్తగా ఉంది. ట్రైలర్‌ చాలా బాగుంది. ఆకాష్ లుక్స్‌, వాయిస్‌ బాగున్నాయి. ఆకాష్ పెద్ద స్టార్‌ కావాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement