ప్రభాస్‌ క్రేజ్‌.. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే..! | Prabhas To Make His Grand Instagram Debut | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ క్రేజ్‌.. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే..!

Apr 12 2019 12:46 PM | Updated on Apr 12 2019 12:46 PM

Prabhas To Make His Grand Instagram Debut - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. బాహుబలి సక్సెస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాహో కూడా అదే స్థాయిలో రూపొందుతుండటం, ఇప్పటికే రిలీజ్ అయిన సాహో టీజర్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో ప్రభాస్‌ క్రేజ్‌ తారా స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ ప్రభాస్‌కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.

ఈ క్రేజ్‌ సోషల్‌ మీడియాలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌కు కోటి మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా ప్రభాస్‌ మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే తన ఇన్స్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించాడు ప్రభాస్‌. అయితే ఈ అకౌంట్‌లో  ఒక్క పోస్ట్ కూడా చేకుండానే దాదాపు 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

ఇక సినిమా విషయానికి వస్తే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పిరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు ప్రభాస్‌.

Advertisement
 
Advertisement
Advertisement