కామెడీ పూనమ్! | poonam pandey new movie after malini and co | Sakshi
Sakshi News home page

కామెడీ పూనమ్!

Oct 14 2016 11:42 PM | Updated on Sep 4 2017 5:12 PM

కామెడీ పూనమ్!

కామెడీ పూనమ్!

‘ఇండియా క్రికెట్ టీమ్ 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలో తిరుగుతా’ అని స్టేట్‌మెంట్ ఇచ్చిన మోడల్

‘ఇండియా క్రికెట్ టీమ్ 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలో తిరుగుతా’ అని స్టేట్‌మెంట్ ఇచ్చిన మోడల్, నటి పూనమ్ పాండే ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆమె మాటలపై అప్పట్లో పెను దుమారమే రేగింది. హాట్ ఫొటోలు, కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ ‘మాలిని అండ్ కో’ తర్వాత తాజాగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో వీబీఆర్ క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నిర్మాతలు విజయ్‌భాస్కర్ రెడ్డి, ఫక్రుద్దీన్ షా మాట్లాడుతూ- ‘‘వినోదమే ప్రధానంగా సాగే చిత్రమిది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పూనమ్ పాండే నటన, అందచందాలు యువతను ఆకట్టుకుంటాయి. ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో కూడా కనిపిస్తారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement