బ్యాంకాక్‌లో ఫైట్ | Poonam Pandey malini and co మూవీ shooting in Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో ఫైట్

Jan 27 2015 11:36 PM | Updated on Sep 2 2017 8:21 PM

బ్యాంకాక్‌లో ఫైట్

బ్యాంకాక్‌లో ఫైట్

పూనమ్ పాండే టైటిల్ రోల్‌లో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మిస్తున్న చిత్రం ‘మాలినీ అండ్ కో’.

 పూనమ్ పాండే టైటిల్ రోల్‌లో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మిస్తున్న చిత్రం ‘మాలినీ అండ్ కో’. చిత్రనిర్మాత తనయుడు మిలన్ హీరోగా నటిస్తున్నారు. వీరు. కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా వీరు. కె మాట్లాడుతూ -‘‘పూనమ్ పాండే అంటే గ్లామరస్ ఆర్టిస్ట్ అని అందరూ అనుకుంటారు. అది వాస్తవమే అయినా.. శక్తిమంతమైన పాత్రలను కూడా ఆమె అద్భుతంగా చేయగలరని నిరూపించే చిత్రం ఇది. ఈ నెలాఖరున బ్యాంకాక్‌లో ఓ భారీ ఫైట్‌ని చిత్రీకరించనున్నాం. హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా చేసిన రోనీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement