ఫోర్త్‌ గ్యాంగ్‌తో సంబంధం లేదు! | Pooja Gandhi, Makarand Deshande, Ravi Kale about 'Dandupalyam 4' | Sakshi
Sakshi News home page

ఫోర్త్‌ గ్యాంగ్‌తో సంబంధం లేదు!

Mar 2 2018 12:06 AM | Updated on Mar 2 2018 12:06 AM

Pooja Gandhi, Makarand Deshande, Ravi Kale about 'Dandupalyam 4' - Sakshi

పూజా గాంధీ, రవి కాలే, మకరంద్‌ దేశ్‌పాండే

భయానికి కేరాఫ్‌ అడ్రస్‌ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్‌. శ్రీనివాస్‌ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా  గాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్‌ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’.

ఈ సినిమా హిట్‌ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్‌ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్‌ అనే నిర్మాత  సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు.

పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్‌ దేశ్‌పాండే అండ్‌  రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement