మోదీగా అక్షయ్‌? | pm Narendra Modi's life story is preparations for the film | Sakshi
Sakshi News home page

మోదీగా అక్షయ్‌?

Jun 22 2017 1:20 AM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీగా అక్షయ్‌? - Sakshi

మోదీగా అక్షయ్‌?

ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. మామూలు కథల కంటే జీవిత కథలను తెరకెక్కించి, బాక్సాఫీస్‌ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొడుతున్నారు.

ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. మామూలు కథల కంటే జీవిత కథలను తెరకెక్కించి, బాక్సాఫీస్‌ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొడుతున్నారు. ‘భాగ్‌ మిల్కా భాగ్, మేరీ కోమ్, ఎం.ఎస్‌. ధోనీ, దంగల్, సచిన్‌’ వంటి పలు బయోపిక్‌ చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి.

పీవీ సింధు, మన్మోహన్‌సింగ్, సానియా మీర్జా బయోపిక్‌లు తెరకెక్కనుండగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో అక్షయ్‌ కుమార్‌ నటించనున్నారని బీటౌన్‌ టాక్‌. పరేశ్‌ రావల్, అనుపమ్‌ ఖేర్‌ వంటి వారు మోదీ పాత్రలో నటించనున్నట్లు్ల వార్తలొచ్చాయి. తాజాగా అక్షయ్‌ పేరు తెరపైకి వచ్చింది. మోదీపై బయోపిక్‌ తీస్తే అక్షయ్‌ కరెక్ట్‌ పర్సన్‌ అని బాలీవుడ్‌ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, సెన్సార్‌ బోర్డు చీఫ్‌ పహ్లజ్‌ నిహ్లానీ కూడా అక్షయ్‌కే ఓటేయడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement