పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

Payal Rajput's Special Song in Directro Teja Next Film - Sakshi

తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్‌ చేసిన అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ, తొలి ప్రయత్నంలోనే గ్లామర్‌ షోతో పాటు నెగెటివ్‌ రోల్‌లోనూ ఆకట్టుకున్నారు. ప‍్రస్తుతం ఆర్డీఎక్స్‌ లవ్‌ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో నటిస్తున్నారు పాయల్‌. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌కు చాన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్‌ నటించబోయేది హీరోయిన్‌గా కాదు. ఓ స్పెషల్ సాంగ్‌ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్ సాంగ్‌లో అలరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top