‘నేల టికెట్టు’కు వస్తున్న పవన్‌ | Pawan Kalyan Coming To Nela Tickettu Audio Function | Sakshi
Sakshi News home page

‘నేల టికెట్టు’కు వస్తున్న పవన్‌

May 4 2018 6:24 PM | Updated on Jul 12 2019 4:40 PM

Pawan Kalyan Coming To Nela Tickettu Audio Function - Sakshi

పవన్‌ కల్యాణ్‌ ‘నేల టిక్కెట్టు’ ఆడియో లాంచ్‌కు వస్తున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదనీ, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ఆ వార్తలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. కానీ ఇప్పుడు అదే రూమర్‌ నిజమైంది. పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా ‘నేల టిక్కెట్టు’ ఆడియో లాంచ్‌ కార్యక్రమం జరుగుతుందని సినిమా డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ తెలిపారు.

ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్ ‘మాస్‌ మహారాజ’ రవితేజ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని మే 10న నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.రవితేజ హీరోగా, మాళవికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో​ ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ‘నేల టికెట్టు’ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement