రోడ్డు ప్రమాదంలో పాక్ నటి సనాఖాన్ మృతి! | Pakistani actress Sana Khan dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పాక్ నటి సనాఖాన్ మృతి!

Mar 9 2014 11:28 PM | Updated on Aug 30 2018 3:56 PM

పాకిస్థాన్ లోని హైదరాబాద్ కు సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్ సినీ నటి సనా ఖాన్ మృతి చెందారు.

పాకిస్థాన్ లోని హైదరాబాద్ కు సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్ సినీ నటి సనా ఖాన్ మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో భర్త బాబర్ ఖాన్ తో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ప్రమాదంలో బాబర్, సనా ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వైద్య బృందం ప్రమాదస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దర్నిలియాకత్ యూనివర్సిటీ ఆస్పత్రిలో తరలించారు. ఎలాంటి వైద్యం అందకుండానే సనా ఖాన్ మరణించినట్టు తెలిపారు. బాబర్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement