అఫీషియల్‌ : రానా ‘హిరణ్యకశ్యప’ | Official announcement Rana Daggubati to Star in Hiranyakashyapa | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌ : రానా ‘హిరణ్యకశ్యప’

Jun 1 2019 1:23 PM | Updated on Jun 1 2019 2:29 PM

Official announcement Rana Daggubati to Star in Hiranyakashyapa - Sakshi

రానా దగ్గుబాటి మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 60 ఏళ్ల తరువాత భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యపుల కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినబడుతున్నా.. చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

తాజాగాచిత్ర దర్శకుడు గుణశేఖర్‌ ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారాన్ని తన ట్విటర్‌పేజ్‌లో పోస్ట్ చేశారు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో రానా టైటిల్‌ రోల్‌లో నటించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.


Advertisement
 
Advertisement
Advertisement