నువ్వు నడిచిన దారిలో... | Nuvvu Nadichina darilo movie shooting started | Sakshi
Sakshi News home page

నువ్వు నడిచిన దారిలో...

Oct 21 2013 12:52 AM | Updated on Aug 28 2018 4:30 PM

నువ్వు నడిచిన దారిలో... - Sakshi

నువ్వు నడిచిన దారిలో...

విషురెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ప్రసాద్ నల్లపాటి నిర్మిస్తున్న ‘నువ్వు నడిచిన దారిలో’ చిత్రం హైదరాబాద్ లోని సాయిబాబా మందిరంలో ప్రారంభమైంది. జరుగుల రామారావు దర్శకుడు. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు.

విషురెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ప్రసాద్ నల్లపాటి నిర్మిస్తున్న ‘నువ్వు నడిచిన దారిలో’ చిత్రం హైదరాబాద్ లోని సాయిబాబా మందిరంలో ప్రారంభమైంది. జరుగుల రామారావు దర్శకుడు. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రెండు విధాలుగా ప్రవర్తించే రెండు ప్రేమ జంటల కథ ఇది. వారి ప్రవర్తన తాలూకు పర్యవసనాలేమిటి? అనేది ప్రధానాంశం.
 
 వినోదంతో పాటు చిన్న సందేశం ఉన్న చిత్రం’’ అన్నారు. పల్లె, పట్టణ, నగర ప్రేక్షకులతో పాటు ప్రవాసాంధ్రులను కూడా మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, మంచి చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ప్రసాద్ తెలిపారు. 
 
 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లోహిత్ మాట్లాడుతూ - ‘‘నిర్మాణ బాధ్యతలు మాత్రమే కాకుండా ఇందులో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. బాధ్యతతో కూడిన ప్రేమ, బాధ్యతారహితమైన ప్రేమకు మధ్య గల వ్యత్యాసాన్ని చూపించే చిత్రం’’ అన్నారు. నందు, ఆదర్శ్,  ప్రియ, సందీప్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరుపతిరెడ్డి, సంగీతం: గణేష్-రాజ్.
 

Advertisement
 
Advertisement
Advertisement