రెండు షూట్లతో ఎన్టీఆర్ బిజీ | Ntr Busy with Jai Lava kusa, Bigg boss | Sakshi
Sakshi News home page

రెండు షూట్లతో ఎన్టీఆర్ బిజీ

Jul 19 2017 12:37 PM | Updated on Sep 5 2017 4:24 PM

రెండు షూట్లతో ఎన్టీఆర్ బిజీ

రెండు షూట్లతో ఎన్టీఆర్ బిజీ

బుల్లితెర అరంగేట్రం చేసిన ఎన్టీఆర్, తన తాజా చిత్రం షూటింగ్ కు కూడా ఎలాంటి బ్రేక్ పడకుండా జాగ్రత్తలు

బుల్లితెర అరంగేట్రం చేసిన ఎన్టీఆర్, తన తాజా చిత్రం షూటింగ్ కు కూడా ఎలాంటి బ్రేక్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బిగ్ బాస్ టెలివిజన్ షో తో పాటు తాను జై లవ కుశ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు షూటింగ్ లు పూణే పరిసరాల్లో జరుగుతున్నాయి.

బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ కనిపించేది కేవలం వారంతం ఎపిసోడ్స్ లోనే కావటంతో ఎక్కువగా జై లవ కుశ కోసమే టైం కేటాయిస్తున్నాడు జూనియర్. ప్రస్తుతం పూణే జరుగుతున్న షూట్ కి సంబంధించిన అప్ డేట్ ను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఎన్టీఆర్. 'జై లవ కుశ షూట్ లో సమర్ధులైన టెక్నీషియన్స్తో వేగంగా జరుగుతోంది' అని ట్వీట్ చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement