బుల్లితెరపై ఎన్టీఆర్ : బిగ్ బాస్ ఫస్ట్ లుక్ | Ntr Big Boss First look | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై ఎన్టీఆర్ : బిగ్ బాస్ ఫస్ట్ లుక్

Jun 13 2017 1:21 PM | Updated on Jul 18 2019 1:41 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ స్టార్స్ నాగార్జున,

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి బుల్లితెరపై వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. త్వరలో యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్లో చేరబోతున్నాడు. నార్త్లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను త్వరలో సౌత్ను లాంచ్ చేస్తోంది స్టార్ నెట్వర్క్. ఈ కార్యక్రమానికి తమిళ వ్యాఖ్యతగా కమల్ హాసన్ను తీసుకోగా తెలుగు వర్షన్కు ఎన్టీఆర్ను తీసుకున్నారు.

ఈ షోలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో ఫస్ట్ లుక్ను స్టార్ నెట్వర్క్ రిలీజ్ చేసింది. సూట్లో స్టైలిష్గా కనిపిస్తున్న ఎన్టీఆర్ వ్యాఖ్యతగానూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆ సినిమా పూర్తయిన తరువాత బిగ్ బాస్ షో షూటింగ్లో పాల్గొననున్నాడు. తొలి సారిగా బుల్లితెర మీద కనిపించేందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ అందుకకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement