నిత్యా ఎక్స్‌ప్రెస్‌ | Nithya Menen to debut in Bollywood through Akshay Kumar's Mission mangal | Sakshi
Sakshi News home page

నిత్యా ఎక్స్‌ప్రెస్‌

Nov 13 2018 2:53 AM | Updated on Nov 13 2018 2:53 AM

Nithya Menen to debut in Bollywood through Akshay Kumar's Mission mangal - Sakshi

పాత్రలు మాత్రమే కనిపించేలా నటించే విలక్షణ నటి నిత్యామీనన్‌. పాత్రలు పోషించడంలోనే కాదు వాటిని ఎంచుకోవడంలోనూ నిత్యది డిఫరెంట్‌ స్టైల్‌. కంటెంట్‌కు ప్రాధాన్యం ఉంటే చిన్న పాత్రలైనా సరే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. ఈ మధ్య సినిమాలను కొంచెం తగ్గించినా ఇప్పుడు నాలుగు భాషల్లో నాలుగు సినిమాలు చేస్తూ ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌లో ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌ ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారామె. తమిళంలో జయలలిత బయోపిక్‌కూ ఓకే చెప్పారు. మలయాళంలో రెండు ప్రాజెక్ట్స్‌  చేస్తున్నారు. అందులో ఒకటి స్పోర్ట్స్‌ ఫిల్మ్‌. ఆ సినిమాలో నిత్యామీనన్‌ జాతీయ స్థాయి క్రీడాకారిణి పాత్ర పోషించనున్నారట. ‘‘ఈ చిత్రం ‘దంగల్‌’లా ఉండబోతోంది. ఈ సినిమా తర్వాతే జయలలిత బయోపిక్‌లోకి వెళ్తాను’’ అని నిత్యామీనన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement