మలేషియా స్టార్ నైట్‌లో ఆడియో రిలీజ్ | Niharika debut Tamil film audio launch in Malaysia | Sakshi
Sakshi News home page

Jan 6 2018 4:27 PM | Updated on Jan 6 2018 4:27 PM

Niharika debut Tamil film audio launch in Malaysia - Sakshi

సినీరంగంలో వారసులుగా అమ్మాయిలు రావటం చాలా అరుదు. గతంలో కృష్ణ వారసురాలిగా మంజుల వెండితెరకు పరిచయం అయ్యే ప్రయత్నం చేసినా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావటంతో విరమించుకున్నారు. మెగా డాటర్ నిహారిక విషయంలోనే ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ తో నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి ఒక్క మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం తన రెండో సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఒరు నల్ల నాల్‌ పాతు సోల్రేం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియోను మలేషియాలో నడిగర్ సంఘం నిర్వహిస్తున్న స్టార్ నైట్ లో రిలీజ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement