నీకై అభిసారికనై...

Neekai Abhisarikanai Movie Press Meet - Sakshi

సాయిబాబు, ఆశీరాం, సురయపర్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘నీకై అభిసారికనై’. సీనియర్‌ ఎడిటర్‌ వెంకట్రామ్‌ పల్లా ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. అనీషా క్రియేష¯Œ ్స పతాకంపై ఓ.సుగుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వెంకట్రామ్‌ పల్లా మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో దాదాపు 2 దశాబ్దాల పైన ఎడిటర్‌గా అనుభవం ఉన్న నన్ను నమ్మి దర్శకత్వం అవకాశం ఇచ్చిన సుగుణగారికి కృతజ్ఞతలు. యూత్‌ని ఆకర్షించేలా లవ్, హారర్‌ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది.

టైటిల్‌లో మంచి ఫీల్‌ గుడ్‌ కనిపిస్తోందని సన్నిహితులు అభినందించారు. ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్‌ రాబిన్‌ సుబ్బు నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ‘‘మొదటి షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ నెల 10 నుంచి రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఈ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తి అవుతుంది’’ అని సుగుణ అన్నారు. రఘుబాబు, మచ్చా నాగభూషణ్, ‘జబర్దస్త్‌’ రాజమౌళి నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బాలాజీ, కెమెరా: ప్రసాద్, సంగీతం: రాజ్‌ కిరణ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top