సింగారాల సిద్ధమ్మ | Nayanthara is Siddhamma in Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

సింగారాల సిద్ధమ్మ

Nov 19 2018 2:36 AM | Updated on Nov 19 2018 2:36 AM

Nayanthara is Siddhamma in Sye Raa Narasimha Reddy - Sakshi

నయనతార, విఘ్నేశ్‌తో..

సౌతిండియాలో స్టార్‌ హీరోయిన్‌గా, లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార దూసుకెళ్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను, కమర్షియల్‌ సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటీష్‌ సైనికుల మీద వీరోచిత పోరాటం చేశారు స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను చిరంజీవి పోషిస్తున్నారు.

ఆయన భార్య పాత్రలో నయనతార కనిపించనున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, తమన్నా, జగపతి బాబు, విజయ్‌సేతుపతి, సుదీప్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్‌ 18న నయనతార జన్మదినం. ఈ సందర్భంగా ‘సైరా’లో ఆమె పాత్ర లుక్‌ను ఆదివారం రివీల్‌ చేశారు చిత్రబృందం. ఇందులో ‘సిద్ధమ్మ’ అనే పాత్ర పోషిస్తున్నారు నయనతార. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

హ్యాపీ బర్త్‌డే తంగమే
నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ప్రేయసి పుట్టినరోజు నాడు విఘ్నేశ్‌ చిన్న బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. హాల్‌ అంతా పువ్వులు, హ్యాపీ బర్త్‌డే నయన్, తంగమే అనే ప్లే కార్డ్స్‌తో డెకరేట్‌ చేసి, హ్యాపీ బర్త్‌డే లేడీ సూపర్‌ స్టార్‌ అని రాసి ఉన్న కేక్‌ను కట్‌ చేయించారు. ‘‘బర్త్‌డే విషెశ్‌ తంగమే (బంగారం)’’ అంటూ ఓ ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు విఘ్నేశ్‌. అంతేకాదండోయ్‌.. తన ట్వీటర్‌ ప్రొఫైల్‌లో కూడా నయనతార ఫొటో పెట్టారు విఘ్నేశ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement