ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు | nani, shraddha srinath jersey teaser release | Sakshi
Sakshi News home page

ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు

Jan 13 2019 3:23 AM | Updated on Jan 13 2019 3:23 AM

nani, shraddha srinath jersey teaser release - Sakshi

నాని

‘నీ వయసు 36 ఏళ్లు. అది ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ నుంచి రిటైరయ్యే ఏజ్‌. పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావ?.. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు’.... 36 ఏళ్ల అర్జున్‌ క్రికెట్‌లో తన కలను నిజం చేసుకోవాలనుకున్నప్పుడు వినిపించిన మాటలు ఇవి. వీటన్నింటినీ తిప్పి కొట్టాడు అర్జున్‌. మాటలతో కాదు. బ్యాట్‌తో... గ్రౌండ్‌లో చేసిన రన్స్‌తో. నాని హీరోగా ‘మళ్ళీరావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’.

ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ ఎండింగ్‌లో ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’ అని నాని చెప్పే డైలాగ్‌ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ‘‘నో సింగిల్స్‌. నో డబుల్స్‌. స్ట్రయిట్‌ అవుట్‌ ఆఫ్‌ ది గ్రౌండ్‌. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అంటూ టీజర్‌ను షేర్‌ చేశారు నాని. ‘‘తెలుగులో నేను సొంతంగా డబ్బింగ్‌ చెబుతున్న సినిమా ‘జెర్సీ’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. అనిరు«ద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement