‘జవనరి 1న అర్జున్‌ని కలవండి’ | Nani Jersey Movie First Look Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Dec 29 2018 4:00 PM | Updated on Dec 29 2018 4:02 PM

Nani Jersey Movie First Look Release Date Confirmed - Sakshi

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. తన రేంజ్‌ కు తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న నేచురల్‌ స్టార్‌ ప్రస్తుతం పిరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్.

నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో కనిపించనున్నాడు. అందుకే జనవరి 1న అర్జున్‌ని కలవండి అంటూ ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement