పండక్కి ప్రారంభం | Nani to do triple role in Jersey film | Sakshi
Sakshi News home page

పండక్కి ప్రారంభం

Sep 17 2018 3:10 AM | Updated on Sep 17 2018 10:54 AM

Nani to do triple role in Jersey film - Sakshi

నాని,

క్రికెట్‌ ప్రాక్టీస్‌ను స్పీడ్‌ అప్‌ చేశారట హీరో నాని. ఎందుకంటే ఆయన మ్యాచ్‌ ఆడే టైమ్‌ దగ్గరపడుతోంది. మరి... నాని జట్టులోని సభ్యులు ఎవరు? టీమ్‌ కెప్టెన్‌ నానీనేనా? ప్రత్యర్థి టీమ్‌ ఎవరు? అనే ఇలాంటి బోలెడు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కాస్త టైమ్‌ పడుతుంది. ‘మళ్ళీ రావా’ వంటి మంచి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న  చిత్రం ‘జెర్సీ’. ‘ఇట్స్‌ నెవర్‌ టూ లేట్‌ టు డ్రీమ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సితార ఎంటైర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రూపొందనుంది.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ దసరా టైమ్‌లో స్టార్ట్‌ అవుతుందని తాజా సమాచారం. అంటే నాని కొత్త  సినిమా పండక్కి ప్రారంభం అన్నమాట. ఇందులో మిడిల్‌ ఏజ్డ్‌ క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో నాని కనిపించనున్నారు. ఒక హీరోయిన్‌గా నిత్యా మీనన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. కాగా నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాసు’ ఈ నెల 27న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement