ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ | Naga Shourya and Sai Pallavi in Kanam | Sakshi
Sakshi News home page

ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ

Sep 2 2017 12:11 PM | Updated on Sep 19 2017 12:59 PM

ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ

ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రెడీ అవుతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రం కణంలో లీడ్ రోల్ లో నటిస్తోంది సాయి పల్లవి.

విక్రమ్ హీరోగా నాన్న లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఓ పాపతో కలిసి ఉన్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టైటిల్ డిజైన్ లోనూ తల్లి గర్భంలోని బిడ్డను చూపించటంతో ఈ సినిమా లేడి ఓరియంటెడ్ మూవీ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement