దేశభక్తికి సరిహద్దుల్లేవ్‌ | Naa Peru Surya shoot progressing at border in - 12° | Sakshi
Sakshi News home page

దేశభక్తికి సరిహద్దుల్లేవ్‌

Feb 5 2018 2:04 AM | Updated on Feb 5 2018 2:04 AM

Naa Peru Surya shoot progressing at border in - 12° - Sakshi

అల్లు అర్జున్‌

సరిహద్దులు దేశానికి ఉంటాయి. దేశభక్తికి కాదు. అందుకే శత్రువు తూటాకన్నా, సైనికుడి కళ్లలోనే పవర్‌ ఎక్కువ. దేశభక్తి ముందు వారికి ప్రాణం మీద తీపి తక్కువ. పరిస్థితులు ఏవైనా, ప్రాంతం ఏదైనా అలుపెరుగని పోరాటం చేసే ధీరుడు సైనికుడు. ఇలాంటి సైనికుడి పాత్రలోనే అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక.

‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన మూవీ ఫస్ట్‌ ఇంపాక్ట్, మేకింగ్‌ వీడియో, ‘సైనిక’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. దీనికి కొనసాగింపుగానే ఫిబ్రవరి 14న మరో సాంగ్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో మైనస్‌ 12 డిగ్రీల వాతావరణంలో షూటింగ్‌ చేస్తున్నాం. విశాల్‌–శేఖర్‌ మంచి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement