ఆసక్తికరంగా ‘హేజా’ టీజర్‌

Munna Kasi And Mumait Khan Starrer Heza Teaser - Sakshi

మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ స్తుండగా  వీఎన్‌వీ క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.  నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు.  షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఇంట్రస్టింగ్‌గా కట్‌ చేసిన టీజర్‌ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సూపర్బ్ అనిపించేలా ఉంది.

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశీ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్‌గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూవీ అవుట్‌పుట్ చాల బాగా ఉంది. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత  కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతుంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top