ఆనందంతో గాల్లో తేలిపోతున్న 'ధోనీ' | movie personalities praise sushant singh rajput over Dhoni performance | Sakshi
Sakshi News home page

ఆనందంతో గాల్లో తేలిపోతున్న 'ధోనీ'

Oct 1 2016 10:04 AM | Updated on Sep 12 2019 8:55 PM

ఆనందంతో గాల్లో తేలిపోతున్న 'ధోనీ' - Sakshi

ఆనందంతో గాల్లో తేలిపోతున్న 'ధోనీ'

ఎంఎస్ ధోనీ సినిమా విడుదల అయ్యిందో లేదో.. ఒక్కసారిగా సినిమావాళ్ల దగ్గర్నుంచి క్రికెటర్లు, మాజీ క్రికెటర్ల వరకు అంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఫ్యాన్స్ అయిపోయారు.

ఎంఎస్ ధోనీ సినిమా విడుదల అయ్యిందో లేదో.. ఒక్కసారిగా సినిమావాళ్ల దగ్గర్నుంచి క్రికెటర్లు, మాజీ క్రికెటర్ల వరకు అంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. అందరూ అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు తెరమీద తాము చూసింది సుశాంత్‌నా.. లేక అసలైన ధోనీనా అనేది తెలియలేదని ఎక్కువ మంది అంటున్నారు. వెనక నుంచి చూస్తే అచ్చం ధోనీని చూసినట్లే ఉందని చెబుతున్నారు. ట్విట్టర్ ద్వారా సుశాంత్‌కు ప్రతి ఒక్కరూ అభినందనలు చెబుతుండటంతో ధోనీ పాత్ర చేసిన ఈ హీరో.. ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు. గాల్లో తేలిపోతున్నాడు.

''ఇప్పుడే నేను ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ చూశా. నువ్వు నిజంగా సుశాంత్‌వా, ధో్నీవా... నీ పెర్ఫార్మెన్సుతో నోట మాట రాలేదు'' అని దక్షిణాది హీరో సూర్య ప్రశంసించాడు.
''నువ్వు అసలైన పెర్ఫార్మర్‌వి. ప్రతి ఫ్రేములోను నువ్వే నా ధోనీవి. ఆ కళ్లలో భావాలు పలికించడం చాలా బాగుంది'' అని బాలీవుడ్, టాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్ చెప్పింది.
''నీ పెర్ఫార్మెన్సు ప్రతి ఫ్రేములోనూ చాలా బాగుంది. నేను ధోనీనే చూశాను తప్ప నిన్ను కాదు. భావాలు, క్రికెట్, రొమాన్స్.. అన్నింటిలోనూ సూపర్బ్. హ్యాట్సాఫ్'' అని ప్రముఖ దర్శక నిర్మాత కునాల్ కోహ్లీ ప్రశంసలు కురిపించారు.
''సుశాంత్ అసలైన పెర్ఫక్షనిస్టు. ప్రతి ఎక్స్‌ప్రెషన్ నుంచి హెలికాప్టర్ షాట్ వరకు.. అద్భుతంగా ఆడావు బ్రో'' అని గాయకుడు, నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నాడు.
''నిజంగా ఆ సినిమాలో చేసింది నువ్వేనా.. ఒక నిమిషం పాటు నన్ను నేనే నమ్మలేకపోయా. అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు వందనం. సినిమా చాలా బాగా నచ్చింది'' అని మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ చెప్పాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement