'అదిరింది' ఆగింది | Mersal's telugu version Adhirindhi postponed | Sakshi
Sakshi News home page

'అదిరింది' ఆగింది

Oct 26 2017 10:36 PM | Updated on Aug 9 2018 7:30 PM

Mersal's telugu version Adhirindhi postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మెర్సల్‌ తెలుగు వెర్షన్‌ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈచిత్రం పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. తమిళం పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్‌ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది. సినిమాకు సెన్సార్‌ పూర్తి కాలేదని, అందుచేతనే విడుదల చేయట్లేదని చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

శుక్రవారం విడుదల నేపథ్యంలో గురువారం చిత్రం ప్రచార దృష్యాన్ని విడుదల చేశారు. కాగా ఆశ్చర్యకరంగా సెన్సార్‌ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నార్త్‌స్టార్‌ ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. సెన్సార్‌లో భాగంగా తెలుగు వెర్షన్‌లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నట్లు సమాచారం. జీఎస్టీపై డైలాగ్‌ వచ్చే సమయంలో ఆడియోను తొలగించనున్నారు. కాగా, తమిళంలో  ఇప్పటికే ఈచిత్రంపై వివాదాలు నడుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement