మాట సాయం

mammootty, mohanlal odeon in fance happy - Sakshi

మోహన్‌ లాల్, మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీ సూపర్‌ స్టార్స్‌. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి సినిమా రిలీజ్‌ అయినా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. అదే ఇద్దరూ ఒకే సినిమాకి వర్క్‌ చేస్తే పండగ డబుల్‌ అవుతుంది. మోహన్‌లాల్‌ నటించిన భారీ చిత్రం ‘ఒడియన్‌’. ఇందులో 25 ఏళ్ల కుర్రాడిలానూ కనిపిస్తారు మోహన్‌లాల్‌. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ పాత్రను పరిచయం చేస్తూ మమ్ముట్టి డబ్బింగ్‌ చెప్పనున్నారట.  ఇది వరకూ ‘శేషం కాల్చాయిల్, పడయోట్టం, హరికృష్ణన్స్‌’ తదితర సినిమాల్లో ఇద్దరూ కలసి నటించారు. ఆల్రెడీ మోహన్‌లాల్‌ నటించిన ‘1971: బియాండ్‌ బోర్డర్స్‌’ చిత్రానికి మమ్ముట్టి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇప్పుడు ‘ఒడియన్‌’కి. ఈ ఇద్దరు స్టార్స్‌ ఎంత స్నేహంగా ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top