ప్రేమలో మలుపులు | love story twist 'manasunu maaya seyake' movie | Sakshi
Sakshi News home page

ప్రేమలో మలుపులు

Sep 26 2013 1:28 AM | Updated on Aug 28 2018 4:30 PM

ప్రేమలో మలుపులు - Sakshi

ప్రేమలో మలుపులు

తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ మధురమైన ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చుకోవాలనుకుంది ఓ జంట. కానీ, కథ వేరే మలుపు తిరిగింది? ఆ మలుపు ఎలాంటిది? ఆ యువతీ యువకుడు తమ ప్రేమను సఫలం చేసుకోగలిగారా?

తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ మధురమైన ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చుకోవాలనుకుంది ఓ జంట. కానీ, కథ వేరే మలుపు తిరిగింది? ఆ మలుపు ఎలాంటిది? ఆ యువతీ యువకుడు తమ ప్రేమను సఫలం చేసుకోగలిగారా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మనసును మాయ సేయకే’. 
 
ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్‌హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జెసన్ పులికొట్టిల్, విన్స్ మాంగ్డన్ నిర్మించారు. సురేష్ పి. కుమార్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించాం. ప్రిన్స్, సేతు అద్భుతంగా నటించారు. మణికాంత్ కద్రి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement