ఇక లవ్‌ గేమ్‌

Kiara Advani joins Ram Charan at Azerbaijan shooting locations - Sakshi

అజర్‌ బైజాన్‌ లొకేషన్‌లో విలన్స్‌ భరతం పట్టారు హీరో రామ్‌చరణ్‌. ఈ సాలిడ్‌ ఫైట్‌ తర్వాత హీరోయిన్‌ కియారా అద్వానీతో లవ్‌ గేమ్‌ ఆడుతున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలోని ఓ మేజర్‌ షెడ్యూల్‌ కోసం టీమ్‌ అజర్‌ బైజాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా కియారా అద్వానీ టీమ్‌కి తోడయ్యారు.

ఈ షెడ్యూల్‌ బుధవారంతో పూర్తయిందని సమాచారం. కానీ, రామ్‌చరణ్‌ అండ్‌ కో ఇండియాకి తిరిగివచ్చేది మాత్రం అక్టోబర్‌ ఒకటో తేదీనే అట. ఇందులో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ మాత్రం ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకుని ముంబై చేరుకున్నారట. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ దసరాకి రిలీజ్‌ అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top