ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?! | KGF2 Unveil Poster Released In Mumbai | Sakshi
Sakshi News home page

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2

Jul 26 2019 4:24 PM | Updated on Jul 26 2019 4:34 PM

 KGF-2 Unveil Poster Released In Mumbai - Sakshi

ముంబై: సినీ చరిత్రలో కేజీఎఫ్‌ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు కొల్లగొట్టి సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్‌.. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాక ప్రపంచ చలన చరిత్రలో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన జీరో సీనిమా సైతం కలెక్షన్లు లేక వెలవెలబోయింది. ప్రస్తుతం కేజీఎఫ్‌ సీక్వెల్‌ గురించి అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ తరుణంలో అధీరా పోస్టర్‌ను హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసింది. కేజీఎఫ్‌ మొదటి భాగంలో యష్‌ ముఖ్య పాత్రను పోషించగా సీక్వెల్‌లో మాత్రం ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ‍విడుదల చేసిన పోస్టర్‌లో సైతం కేవలం వెనక భాగం చూపెట్టడం  ద్వారా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ సంజయ్ దత్ అని సోషల్‌ మీడియాలో రూమర్‌లు వినిపిస్తున్నాయి. ‍అయితే సంజయ్ దత్, రవీన్ టాండన్‌లు  ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement