ఆ ‘కీర్తి’ తనకేనా? | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 8:35 PM

keerthi suresh gets chance to romance with ajith  - Sakshi

తమిళసినిమా: రజనీ మురుగన్, రెమో, భైరవ చిత్రాల తరువాత నటి కీర్తి సురేశ్‌ను కోలీవుడ్‌ తెరపై దర్శనమివ్వలేదు. అలాగని ఈ బ్యూటీకి అవకాశాలు లేవని కాదు. నిజానికి తమిళం, తెలుగు భాషల్లో చేతినిండా చిత్రాలు ఉన్నాయి. అయితే అవన్నీ నిర్మాణ దశలోనే ఉండటంతో కీర్తిని చూసి చాలాకాలం అయిందన్న భావన తమిళ ప్రేక్షకుల్లో కలుగుతోంది. 

దివంగత మహానటి సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న మహానటి, విక్రమ్‌కు జంటగా సామి-2, విశాల్‌తో సండైకోళి-2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న కీర్తీసురేశ్‌.. ఇటు సూర్యకు జంటగా ‘తానాసేర్న్‌ద కూటం’  సినిమాతో సంకాంత్రికి బరిలోకి దూకడానికి సిద్ధం అవుతోంది. 

తాజగా ఈ ముద్దుగుమ్మ  ఖాతాలో మరో భారీ చిత్రం చేరే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. నటుడు అజిత్‌ ‘వివేగం’ వంటి సంచలన చిత్రం తరువాత మరో చిత్రానికి సన్నద్ధం అవుతున్నాడు. వీరం, వేదాళం, వివేగం చిత్రాల దర్శకుడు శివతోనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. వివేగం వంటి హాలీవుడ్‌ స్థాయి చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజిత్‌కు జంటగా కీర్తిసురేశ్‌ పోటీలో ఉందనే చర్చ నడుస్తోంది. స్వీటీ నటి అనుష్క కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఎక్కువ ఛాన్స్‌ కీర్తి సురేశ్‌కే ఉన్నట్టు చెప్తున్నారు.

Advertisement
Advertisement