ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు | Sakshi
Sakshi News home page

ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Published Fri, Feb 17 2017 11:40 AM

KCR BirthDay Celebrations by telugu film industry employees

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణా ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్   1000 బైకులు, 100 కార్ల తో  ర్యాలీని ప్రారంభించారు.


 తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవెర్చటానికి మరియు బంగారు తెలంగాణా సాధనకై అనుక్షణం పాటుపడుతొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టిన రొజులు జరుపుకొవాలని మంత్రి తలసాని, ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ , కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement