టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉంది | KCR Biopic Udyama Simham Movie First Look And Poster Launch | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉంది

Nov 13 2018 3:07 AM | Updated on Nov 13 2018 3:07 AM

KCR Biopic Udyama Simham Movie First Look And Poster Launch - Sakshi

నాగేశ్వరరావు, రాజ్‌ కందుకూరి

‘‘ఉద్యమ సింహం’ టైటిల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేసీఆర్‌గారంటే నాకు ఇష్టం. నిర్మాతలంతా కమర్షియల్‌ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో నాగేశ్వరరావుగారు కేసీఆర్‌పై సినిమా చేయడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా ఇది. కొన్ని సీన్స్‌ చూశా.. చాలా బాగా తీసారు’’ అని నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. నటరాజన్‌ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్‌. విఠల్‌బాబు ప్రధాన పాత్రల్లో అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందించి, నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్‌ కందుకూరి ఆవిష్కరించారు.

నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘జూన్‌లో ప్రారంభించిన ‘ఉద్యమ సింహం’ సినిమా షూటింగ్‌ సోమవారంతో పూర్తయింది. మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. ఈ నెల 16న ఆడియో, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కేసీఆర్‌ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం. కేసీఆర్‌ పాత్ర ఎవరు పోషించారు? మిగతా నటీనటులు ఎవరు? అన్నది ఆడియో విడుదల రోజున చెబుతాం’’ అని అల్లూరి కృష్ణంరాజు అన్నారు. సంగీత దర్శకుడు దిలీప్‌ బండారి, మాటల రచయిత కృష్ణ రాపోలు, ఛాయాగ్రాహకుడు ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
∙నాగేశ్వరరావు, రాజ్‌ కందుకూరి

Advertisement
 
Advertisement
Advertisement